మనం మామూలుగా మన ఇంటిని ఆధునికంగా డిజైన్ చేయించుకుంటాము. అలాగే మన బెడ్ రూమ్ ని కూడా మనకి నచ్చినట్లుగా డిజైన్ చేయించుకుంటాము. కానీ ఈ డిజైన్ చేసే ప్రక్రియ లో మనం పగటి పూట ఎలా కన్పిస్తుంది మరియు మనకి సౌకర్యంగా ఉందా అనే దాని మీద మాత్రమే దృష్టి పెడతాము. కానీ మీరు మీ బెడ్ రూమ్ ని రాత్రి పూట మీరు నిద్రించడానికి సౌకర్యంగా ఉండేలాగా డిజైన్ చేయించుకుంటున్నారా ? మీ బెడ్ రూమ్ మీకు మంచి ఆరోగ్యకరమైన నిద్రకు సహాయపడుతుందా? మీరు నిద్రించే వాతావరణం మీకు నాణ్యమైన నిద్రను అందజేస్తుందా?

ఈ ఆర్టికల్ మంచి నిద్ర పొందడానికి కావలిసిన కంఫర్టబుల్ స్లీప్ ఎన్విరాన్మెంట్ ని ఎలా సృష్టించుకోవాలి అని మీకు ఒక అవగాహన కలిపిస్తుంది మరియు సహాయపడుతుంది.

అసలు స్లీప్ ఎన్విరాన్మెంట్ మీ నిద్రకు ఆటంకం కలిగిస్తుందా?

అవును. స్లీప్ ఎన్విరాన్మెంట్ సరిగ్గా లేకపోతే మీ నిద్రకు ఆటంకం కలుగుతుంది. పెద్ద శబ్దాలు, ఎక్కువ కాంతి, కంఫర్ట్ లేని మ్యాట్రెస్ మరియు దిండ్లు , అధిక వేడి లేదా చల్ల దనం లాంటి కొన్ని అంశాలు మీ నిద్రకు భంగం కలిగిస్తాయి.

ఆటంకం లేని నిద్ర వల్ల వచ్చే ఉపయోగాలు

  • శారీరక ఆరోగ్యం: ఆరోగ్యకరమైన నిద్ర వల్ల మీ శరీరానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీ శరీరం యొక్క ఇమ్యూనిటీ పెరిగి మిమ్మల్ని వివిధ రోగాల నుండి కాపాడుతుంది. అలాగే మీ కండరాల ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది మరియు మీ శరీరానికి రిలాక్సేషన్ ను అందిస్తుంది. మంచి నిద్ర  మీ గుండె రోగాలను మరియు రక్తపోటు సమస్యలను దూరం చేయడానికి సహాయపడుతుంది. అలాగే గాయం అయినప్పుడు, మంచి నిద్ర ఉండడం వలన మీరు త్వరగా కోలుకుంటారు.
  • మానసిక ఆరోగ్యం: ఆరోగ్యకరమైన నిద్ర వలన మీ మానసిక ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీ మూడ్ ని మెరుగుపరుస్తుంది.  స్లీప్ డిసార్డర్స్, డిప్రెషన్ మరియు ఆంక్సయిటీ ని దూరం చేస్తుంది. అలాగే మీ మానసిక ఒత్తిడిని దూరం చేసి మీకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది.
  • నాణ్యమైన నిద్రను ప్రోత్సహిస్తుంది: మీరు నిద్రపోయే వాతావరణం మీ నిద్రకు అనుకూలంగా ఉంటే మీ నిద్రకు ఎం ఆటంకం ఉండదు. దీని వల్ల మీకు నాణ్యమైన నిద్ర దొరుకుతుంది.
  • హార్మోనల్ బాలన్స్: ఆరోగ్యకరమైన నిద్ర మీ హార్మోన్ల ఇంబ్యాలెన్సు ను దూరం చేస్తుంది. మీ శరీరం యొక్క మెటబాలిజం ను కూడా పెంచుతుంది.
  • స్లీప్ డిసార్డర్స్ ను నివారిస్తుంది: ఇన్సొమ్నియా, స్లీప్ ఆప్నియా వంటి స్లీప్ డిసార్డర్స్ ను మంచి నిద్ర వాతావరణం నివారిస్తుంది. మంచి స్లీప్ ఎన్విరాన్మెంట్ మీ నిద్ర ఇబ్బందుల నుండి మిమ్మల్ని విముక్తి చేస్తుంది.
  • దీర్ఘకాల ఆరోగ్యం: ఆరోగ్యకరమైన నిద్ర డైయాబెటిస్, గుండె రోగాలు, న్యూరోలాజికల్ వ్యాధుల వంటి దీర్ఘకాల వ్యాధులను మీ నుండి దూరం చేస్తుంది. ఆరోగ్యమైన నిద్ర మీ జీవిత కాలాన్ని పెంచడానికి మరియు మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

ఆరోగ్యకరమైన నిద్ర మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు మీ రోజువారీ పనులని సమర్థవంతంగా చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది. మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితం మెరుగ్గా ఉండడానికి సహాయపడుతుంది.

కంఫర్టబుల్ స్లీప్ ఎన్విరాన్మెంట్ ఎలా సృష్టించాలి

నాణ్యమైన నిద్ర మరియు విశ్రాంతి అందాలంటే కంఫర్టబుల్ స్లీప్ ఎన్విరాన్మెంట్ ముఖ్యం.  ఇప్పుడు మనం కంఫర్టబుల్ స్లీప్ ఎన్విరాన్మెంట్ ను ఎలా సృష్టించుకోవాలో తెలుసుకుందాం:

1) ఉష్ణోగ్రతను ఆప్టిమైజ్ చేయండి: మీ బెడ్ రూమ్ లో ఉష్ణోగ్రత మరీ వేడిగా లేకుండా మరీ చల్లగా లేకుండా చూసుకోండి.కాటన్ లేదా మంచి  బ్రీతబుల్ ఫాబ్రిక్స్ కలిగిన బేడీషీట్స్ మరియు పిల్లోస్ వాడడం వలన మీకు మంచి చల్లదనం అందుతుంది మరియు నాణ్యమైన నిద్రను ప్రోత్సహిస్తుంది.  

2) పెద్ద శబ్దాలను తగ్గించండి: పెద్ద శబ్దాలను తగ్గించడానికి ప్రయత్నించండి. దీని కోసం సౌండ్ ప్రూఫింగ్ లేదా బ్లాకౌట్ కర్టైన్స్ వాడండి. వీటి వల్ల శబ్దాలు తగ్గి, మీరు ప్రశాంతంగా నిద్ర పోతారు.

3) కాంతి నిర్వాహణ: మీ బెడ్ రూమ్ లో కాంతి ని మానేజ్ చేసుకోండి. పగటి పూట ఎక్కువగా సహజ కాంతి మీ గదిలోకి వచ్చేలాగా చూసుకోండి. ఇది మీ సిర్కాడియన్ రిథమ్ ని నియంత్రిస్తుంది.

రాత్రి పూట డిం లైట్ ని వాడండి. ముఖ్యనగ పడుకునేముందు బ్లూ లైట్ ని చూడకండి. ఫోన్స్ మరియు వేరే ఎలక్ట్రానిక్ పరికరాలను మీ నుండి దూరంగా ఉంచండి.

మీ బెడ్ రూమ్ లో బ్లాకౌట్ కర్టైన్స్ వాడండి. దీనివల్ల మీ గదిలోకి కాంతి రాకుండా ఉంటుంది. వీలయితే నిద్రపోయేటప్పుడు ఐ మాస్క్ ను వాడండి.

4) కంఫర్టబుల్ బెడ్ రూమ్: మీరు వాడే మ్యాట్రెస్ మీకు మంచి కంఫర్ట్ ఇచ్చే లాగా చూసుకోండి. మంచి సాఫ్ట్ మరియు దృఢమైన మ్యాట్రెస్ ను ఎంపిక చేసుకోండి. వీలైతే 7-8 సంవత్సరాలకు ఒకసారి మీ మ్యాట్రెస్ ను మార్చుకోండి.

అలాగే మంచి కంఫర్ట్ కలిగి ఉన్న పిల్లోస్ ని వాడండి. మంచి మెమరీ ఫోమ్ పిల్లోస్ మరియు బ్రితబుల్ ఫాబ్రిక్ కలిగి ఉన్న పిల్లోస్ వాడడం వలన మీకు మంచి నిద్ర అందుతుంది.

మంచి కంఫర్ట్ కలిగి ఉన్న బెడ్ షీట్స్ మరియు బ్లాంకెట్స్ ని వాడండి. ఇలా మీ బెడ్ రూమ్ కంఫర్ట్ గా ఉంటే, మీరు శరీరం రిలాక్స్ అయ్యి మీకు మంచి నిద్ర అందుతుంది.

5) ఎలక్ట్రానిక్ పరికరాలు: నిద్రకు ముందు వీలైనంతవరకు మొబైల్ ఫోన్, లాప్టాప్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల వాడకాన్ని తగ్గించండి. నిద్రముందు ఎలక్ట్రానిక్ పరికరాలను వాడడం వలన మీ నిద్రకు ఆటంకం కలుగుతుంది మరియు వాటి కాంతి వలన మీకు నిద్ర పోవడానికి ఇబ్బంది అవుతుంది.  

6) ఆహారం: నిద్రకు అరగంట లేదా గంట ముందు కాఫ్ఫైన్ లేదా ఆల్కహాల్ వంటి పదార్థాలు తీసుకోవడం మానేయండి. ఇవి మీ నిద్రకు భంగం కలిగిస్తాయి. కావాలంటే ఏదైనా హెర్బల్ టీ లేదా తేలికగా అరిగే ఆహారం తీసుకోడానికి ప్రయత్నించండి.

7) బెడ్ రూమ్ డెకొరేషన్ మరియు డిజైన్: మీ బెడ్ రూమ్ ని సింపుల్ గా డిజైన్ చేసుకోండి. ఎక్కువ సామాను లేకుండా చూసుకోండి. గది లో సామాను తక్కువగా ఉంటే మీకు ప్రశాంతంగా ఉంటుంది మరియు రిలాక్సేషన్ ను స్అందుతుంది. గది ని  శుభ్రంగా ఉంచుకోండి.

అలాగే మీ బెడ్ రూమ్ లో సాఫ్ట్ మరియు సూథింగ్ కలర్స్ ను వాడండి. లైట్ బ్లూ, గ్రీన్ లేదా మంచి సాఫ్ట్ కలర్స్ వాడడం వలన మీకు గది లో ప్రశాంతంగా ఉంటుంది. అలాగే వీలయితే మీ బెడ్ రూమ్ లో మంచి డెకొరేటివ్ ఐటమ్స్ ని పెట్టుకోండి. మీ గది అందంగా మరియు ప్రశాంతంగా ఉంటుంది.

8) ఎయిర్ క్వాలిటీ: మీ బెడ్ రూమ్ లో మంచి వెంటిలేషన్ ఉండే లాగా చూసుకోండి. మంచి వెంటిలేషన్ ఉంటే ఉదయం పూట మంచి వెలుతురు మరియు గాలి గదిలోకి వస్తుంది. అలాగే రాత్రి పూట కూడా మంచి గాలి వస్తుంది. ఫ్రెష్ ఎయిర్ మీ గదిలోకి వస్తే మీకు మంచి నిద్ర అందుతుంది.

మీరు ఉండే చోట కాలుష్యం ఎక్కువగా ఉన్నట్లయితే ఎయిర్ ప్యూరిఫైర్లు వాడండి. లేదా గాలిని శుభ్రం చేసే ప్యూరిఫయింగ్ మొక్కలను ఇంట్లో పెంచుకోండి. ఇవి మీరు ఆరోగ్యాంగా ఉండడానికి తోడ్పడతాయి.

9) అరోమాథెరపీ: మీరు నిద్రపోయే ముందు అరోమాథెరపీ చేసుకోండి. అరోమాథెరపీ కోసం మీరు అరోమా డిఫ్యూజర్స్ వాడొచ్చు. ఈ అరోమా డిఫ్యూజర్స్  మీ గదిలో మంచి సువాసనను వెదజల్లుతూ మీకు రిలాక్సేషన్ ను అందిస్తాయి. స్లీప్సియా వారి ReNe ఎలక్ట్రిక్ అరోమా డిఫ్యూజర్ మీకు అరోమాథెరపీ కోసం బాగా ఉపయోగపడుతుంది. స్లీప్సియా వారి ఎలక్ట్రిక్ అరోమా డిఫ్యూజర్స్ లో led లైట్ కూడా ఉంది. ఈ లైట్ మీ గదిలో మంచి రిలాక్సేషన్ ను కలిగించే వాతావరణాన్ని తయారు చేస్తుంది.

ఆరోమా డిఫ్యూజర్స్ మీ గదిలో రిలాక్సేషన్ ను కలిగించే వాతావరణాన్ని సృష్టించి మీకు మంచి నిద్రను అందజేస్తాయి. స్లీప్సియా ఎలక్ట్రిక్ అరోమా డిఫ్యూజర్స్ లో ఎసెన్షియల్ ఆయిల్స్ ని వేసి పవర్ కి కనెక్ట్ చేయగానే ఆ డిఫ్యూజర్ ఎసెన్షియల్ ఆయిల్స్ ని ఆవిరి లాగా చేసి గది మొత్తం సువాసన వేదజల్లుతుంది. గదిలో మంచి సువాసన ఉండడం వలన మీ గది నిద్ర పోవడానికి అనుకూలంగా ఉండి మీరు ప్రశాంతంగా నిద్ర పోతారు.

10) అదనపు టిప్స్: మీ గదిలో మంచి సువాసన వెదజల్లే స్ప్రే ను వాడండి. దీనితో గది మొత్తం మంచి సువాసన వస్తుంది మరియు నిద్రకు అనుకూలంగా ఉండే వాతావరణాన్ని సృష్టిస్తుంది.  అలాగే మీరు నిద్రించే ముందు, వేడి నీళ్లతో స్నానం చేయడం, స్లీప్ యోగ మరియు మెడిటేషన్,  ఏదైనా రిలాక్సింగ్ పుస్తకం చదవడం వంటివి చేయడం ద్వారా మీకు ప్రశాంతంగా నిద్ర పడుతుంది. అలాగే మీరు స్నానం చేసేటప్పుడు లావెండర్ ఆయిల్, కామోమైల్ ఆయిల్ వంటి ఎసెన్షియల్ బాత్ ఆయిల్స్ ని వాడడం ద్వారా మీకు మంచి రిలాక్సేషన్ అందుతుంది.

ముగింపు

ఒక మంచి నిద్ర వాతావరణాన్ని సృషించడం మరియు అదనంగా అరోమాథెరపీ ని చేసుకోవడం ద్వారా మీకు నాణ్యమైన నిద్ర అందుతుంది. రెనే మారిస్ ఎలక్ట్రిక్ అరోమా డిఫ్యూజర్ మీకు ఈ ప్రక్రియ లో బాగా ఉపయోగపడుతుంది. మంచి నిద్ర ఉంటే మంచి ఆరోగ్యం దొరుకుతుంది. మంచి ఆరోగ్యం ఉంటే మీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది.